బాంద్రాలోని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
అన్మోల్ బిష్ణోయ్‌పై బలమైన కేసును నిర్మించేందుకు ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, బీహార్, గుజరాత్, రాజస్థాన్ వంటి వివిధ ప్రాంతాలకు బృందాలను పంపుతున్నట్లు వెళ్లడించారు. అదనంగా, అతను విదేశాలలో తలదాచుకున్నట్లు భావిస్తున్నందున మేము అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) జారీ చేస్తామని ఒక పోలీసు అధికారి తెలిపారు.
బిష్ణోయ్‌పై ఉన్న కేసుల వల్ల ఈ కేసులో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్‌లోని కఠినమైన సెక్షన్లను కూడా ప్రయోగించవచ్చని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు నదిలో వేసినట్లు చెబుతున్న ఆయుధాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వారు పేర్కొన్నారు.