News Andhra Pradesh Political

అలముకున్న అంధకారం … వెలగని వీధి లైట్లు

కాకినాడ స్మార్ట్‌ సిటీలో వీధిలైట్లు సైతం వెలగట్లేదని కాకినాడ నగర పాలక సంస్థ లోని పలు ప్రాంతాల వారు వాపోతున్నారు. ఏడు సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేసిన ఇఎస్‌ఎల్‌ కంపెనీ కాంట్రాక్టు కాల గడువు 2023 మార్చితో ముగిసింది. అప్పటి నుంచి ఆరు నెలలు గడిచింది. మరో కాంట్రాక్టర్‌ను పిలిచే ప్రక్రిలో 90 లక్షల రూపాయల అంచనాలతో సెన్షార్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నారు.

నగర పరిధిలో 15,500 వీధి లైట్లు ఉన్నట్టు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ విభాగ అధికారి సాంబశివరావు చెబుతున్నారు. అయితే వీటిలో సుమారు 5 శాతం మేరకు పనిచేయకపోవచ్చునని కూడా చెబుతున్నారు. కాగా నగర ప్రజలు ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. సుమారు 40 శాతం మేరకు లైట్లు వెలగడం లేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ దూసర్లపూడి రమణరాజు ఆరోపిస్తున్నారు. గత కాంట్రాక్టర్‌కు ఏడాదికి 23 లక్షల రూపాయలు వీధిదీపాల నిర్వాహణ నిమిత్తం కాంట్రాక్ట్‌ సొమ్ము చెల్లించేవారు. సంబంధిత కాంట్రాక్టరే వర్కర్లను నియమించుకుని వారికి వేతనాలు చెల్లించేవారు.

కాంట్రాక్ట్‌ కాలగడువు ముగియడంతో 18 మంది సిబ్బందిని కేఎంసీ పరిధిలోనికి తీసుకుని, కేఎంసీ నిధుల నుంచే వారికి నెలకు 3.5 లక్షల రూపాయల చొప్పున వేతనాల చెల్లింపు చేస్తున్నట్టు ఇంజనీర్‌ సాంబశివరావు చెబుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ కార్పోరేషన్‌ ఫర్‌ కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ (ఏపీసిఒఎస్‌) లో 11 మంది ప్రైవేటు కాంట్రాక్ట్‌లో 8 మంది సిబ్బంది పని చేస్తున్నట్లు సమాచారం. వీధి లైట్ల కొనుగోలు, వేతనాల చెల్లింపుల్లో సొమ్ము చేసుకోవడం పై ఉన్న శ్రద్ధ వీధి లైట్లు వెలిగించడంలో చూపటం లేదని ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి.

కేఎంసీ ఇంచార్జి కమిషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహారావు మాట్లాడుతూ నగర సుందరీకరణ కు వీధిలైట్ల అధునీకరణ ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించి 90 లక్షల రూపాయల అంచనాలతో వీధిలైట్లకు సెన్సార్లు అమర్చనున్నట్టు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లతో వీధిలైట్ల కాంతికి ఆటంకం కలుగుతున్నందున వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరొక కాంట్రాక్ట్‌ను నియమించేందుకు టెండర్లు పిలిచామని, త్వరలో ఫైనలైజ్‌ కానుందన్నారు. లైట్లు కొనుగోలు నెల నెల కాకుండా ప్రతీ మూడు నెలలకు చేపట్టే విధంగా తగినంత సామాగ్రి చేకూర్చనున్నట్టు తెలియజేశారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.