Political

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్న మోడీ గో బ్యాక్… -వామపక్షాల నిరసన-

IMG-20231126-WA0022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అంటూ కాకినాడ మసీదు సెంటర్ లో నల్ల బెలూన్లతో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, న్యూ డెమోక్రసీ నాయకులు జె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చిన మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి దూకుడు గా వ్యవహరిస్తున్న మోడీ గో బ్యాక్ అన్నారు. కృష్ణా జలాల విషయంలో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు వంటి అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బీ.జే.పీ. ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందన్నారు.

ప్రజలంతా మోడీ రాకను, విధానాలను వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.సీ.పీ. , ప్రధాన ప్రతిపక్షమైన టీ.డీ.పీ., ప్రశ్నించడానికి వచ్చిన జనసేన బీ.జే.పీ. కి వంతపాడడం మానుకోవాలి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు నాగేశ్వరరావు, నావహు, సిపిఎం నాయకులు కెఎస్ శ్రీనివాస్, కె. సత్తిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.