Political

ప్రభుత్వం నిత్యవసర వస్తు ధరలను నియంత్రించలేకపోతోంది – కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు-

IMG-20231028-WA0015

నిత్యవసర వస్తువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కమిటీ దుయ్యబట్టింది. దరల పెరుగుదలపట్ల అన్ని వర్గాలల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని పార్టీ అభిప్రాయబడింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ కుమార్ అధ్యక్షతన పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సమావేశం తీర్మాణించింది. ఉద్యోగులకు జీతాలు లేవని, నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతోందని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, రైతులకు సాగునీరు అందడంలేదని ఈ నేపద్యంలో నిత్యవసర వస్తువులు ధరల పెరుగుదల పట్ల బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబడ్డారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నేతలు ముత్తా నవీన్, చిట్నీడి శ్రీనివాస్, కొక్కెర గడ్డ గంగాధర్, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, తుమ్మల పద్మజ, శ్రీమతి పితాని లీల, పైడా రవీంద్ర తదితరులు బిజెపి అనుసరించాల్సిన విధానాలపై మాట్లాడారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.