Political

ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎం.ఎల్.ఏ. …

OIP (8)

కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ జీపీ శనివారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కేబినెట్ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ సింగ్‌ను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఆయన చేరికతో ఫతేఘర్ సాహిబ్‌లో ఏ.ఏ.పీ. లో కొత్త ఉత్సాహం పుంజుకుంది. సింగ్ 2017 లో ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని బస్సీ పఠానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి విఫలమయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏ.ఏ.పీ. లో చేరారు.

ఈ సందర్బంగా ఆయనల మాట్లాడుతూ… కాంగ్రెస్‌ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం పార్టీలో క్రమశిక్షణ లేకపోవడమేనని అన్నారు. మాన్ పనితనం తనను ఆకట్టుకున్నదని చెప్పాడు. అతను నిజాయితీగల నాయకుడు. అందుకే మేము ఏ.ఏ.పీ.లో చేరుతున్నాము అని అన్నారు. నేడు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలు ఈ పార్టీ గురించి మాత్రమే మాట్లాడతారు అని సింగ్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫతేఘర్ సాహిబ్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని సింగ్ చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.