News Political

ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధంగా కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాసర పట్టాభి రామస్వామి, డి పి ఆర్ స్వామి విరాళా భాగస్వామ్యంతో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి, విజయవాడ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. కాకినాడ వార్ప్ రోడ్ లో ఉన్న నాలం వారి వీధిలో బాదం ప్రభాకర్ రావు, బాసర పట్టాభి రామస్వామి హిమబిందు కల్యాణ మండపాన్ని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కాకినాడ శాఖ అధ్యక్షులు బాదం మధు ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి చేసుకోవడం అభినందనీయం అన్నారు. కాకినాడ నగరంలో ఆర్యవైశ్యుల సంక్షేమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అన్నారు. రాష్ట్రస్థాయిలో కాకినాడ ఆర్యవైశ్య మహాసభ ముందంజలో ఉందని దానికి డిపిఆర్ స్వామి లాంటి దాతలు బాసటగా నిలవడం మహాసభ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.

డిపిఆర్ స్వామి సుమారు 25 లక్షల రూపాయలు ఈ భవన నిర్మాణానికి విరాళంగా అందజేయడంతో కాకినాడ నగరంలో అదునూతన సౌకర్యాలతో కళ్యాణ మండపం రూపుదిద్దుకోవడం ఆర్యవైశ్యుల ఐక్యతను చాటుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ద్వారకారావు, కాకినాడ మహాసభ ట్రెజరర్ బోడారవికుమార్, కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ లను ముఖ్య అతిథి వెల్లంపల్లి శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.