Kakinada

ఆర్.పి.ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యాక్రమం…

WhatsApp Image 2023-12-06 at 11.11.56 AM

కాకినాడ ఎల్విన్ పేటలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ భీ.ఆర్. అంబేద్కర్ 67వ వర్ధంతిని ఆర్.పి.ఐ. (అంబేద్కర్) ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్వత్వం అనే నాలుగు స్తంభాలపై అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని కొనియాడారు.

పటిష్టమైన అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం మార్పు చేసేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. దీనివల్ల ప్రజలకు సామాజిక న్యాయం, బావ స్వతంత్రం, సమానత్వ లేకుండా అరాచకాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. భారత ప్రజలు అప్రమత్తమై, దేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, పచ్చిపాల కుమార్, తదితరులు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ