Knowledge

ఆలమూరోళ్ల పుస్తక రూపకల్పన…

WhatsApp Image 2023-12-09 at 10.03.41 AM

చరిత్రను చూసుకుంటే ప్రతీ ప్రాంతంలో అనేక అద్భుతాలు కనిపిస్తాయి. ఇటువంటి అద్భుత కథనాలు బహిర్గతం కాకుండానే అనగారిపోతుంటాయి. అందుకనే ఇప్పుడు చాలామంది అలాంటి చరిత్రలను అందరికీ తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. అలాంటి కృషి ఫలితమే ఆలమూరోళ్ల కథలు పుస్తకే . ఈనాడు జర్నలిస్ట్ గొడవర్తి శ్రీనివాసు ఈ పుస్తకానికి రూపకల్పన చేశారు. హైదరాబాదులో ఈ పుస్తక ఆవిష్కరణ ప్రముఖుల చేతులమీదుగా జరిగింది.
ఆ పుస్తకాన్ని కొంతవరకు చదివితేనే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆలమూరు గ్రామంలో ఇంతమంది కవులు ఉన్నారా అని ఆశ్చర్యమేసింది. గొడవర్తి శ్రీనివాసు “ఇ(పు)లసాయనం” పేరుతో రాసిన ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా ఆలోచింపజేసేలా ఉంటుంది. ఓ పక్క పులస ప్రత్యేకతలు వివరిస్తూనే నదులను ప్రజలు ఎలా కలుషితం చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇటువంటి పుస్తకాలు చదవటం ద్వారా అనేక విషయాలు తెలియడంతో పాటు పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-15 at 5.21.24 PM
Knowledge

డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారే నిజమైన విద్యార్ధులు. – డాక్టర్ కాదా వెంకటరమణ-

  డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం ప‌రితపించేవారే నిజమైన విద్యార్ధుల‌ని స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ‌ అన్నారు. ఆయన
WhatsApp Image 2023-10-16 at 2.42.03 PM
Knowledge

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం… — ర్యాలీ నిర్వహించిన అనస్థీషియా వైద్యులు —

1846, అక్టోబరు 16న, మొదటిసారిగా డబ్ల్యూటీజి మోర్టన్ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో దంతాల వెలికితీతలో ఈథర్ అనస్థీషియాను ఉపయోగించడాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. అప్పటి నుండి, రోగులలో మెరుగైన