Future

ఇస్రో శాస్త్రవేత్తలపై పవన్ వ్యాఖ్యలు…

74884490

భారతదేశ వాతావరణ పరిశోధనకు దోహదపడే అధునాతన ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. చంద్రయాన్-3 తో చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండర్ ను దించి, సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాలను సంధించి విజయం సాధించిన ఇస్రో సంస్థ అదే పరంపరలో ఈ విజయం భారతదేశానికి మరో గర్వకారణమని అన్నారు. ఇన్సాట్-3 డీ.ఎస్ గా నామకరణం చేసి విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు. మరెన్నో ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అంతరిక్ష యవనికపై భారత జైత్ర యాత్ర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

R
Future

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండను 23-01-2024 తేదీన పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా
WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM
Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య