Kakinada

ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు లేవు… -కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్-

IMG_20231123_165243

కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు అవకాశం లేకుండా పారదర్శక పద్ధతిలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నివేదిక రూపొందిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహరావు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే బీ.ఎల్.ఓ. లు ద్వారా సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటా ఓటరు వివరాలు సేకరిచడం వారి పేర్లను ఓటరు జాబితా లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మరికొంత మంది తమ నివాసాలను విడిచి దూరప్రాంతాలకు వెళ్ళిన వారిని గుర్తించి వారికి రిజిష్టర్ పోస్టల్ ద్వారా సమాచారం అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫారం 6,7,8 అభ్యర్థనలు క్షుణ్ణంగా పరిశీలించి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని అలాగే ఓటు నమోదు ప్రక్రియ లో జరిగిన పొరబాటు, తప్పులను సవరించి జనవరి 5 నాటికి ఓటు జాబితా ముద్రణ తయారు అవుతుందని అన్నారు.    

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ