Exclusive

ఎన్నికల విధులో వాలంటీర్లను దూరంగా ఉంచాలని… -ఎలెక్షన్ కమీషన్-

AP Volunteers Distributing Pensions To Pensioners Photo Gallery_1

ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఎపిటెట్ ఫలితాలను వెలువరించ వద్దని, ఎపిటిఆర్‌టి పరీక్షలను నిర్వహించవద్దని వాయిదా వేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాలకు సంబందించిన ఆదేశాలు ఎన్నికల సంఘం నుండి నేడే తమ కార్యాలయనికి అందాయని ఆయన తెలిపారు.

భారత ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు ఎటువంటి పథకాలు, పింఛను, నగదును పంపిణీ చేయకూడదని ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ఇతర డివైజ్లను వెంటనే సంబందిత జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకాలను ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు పర్చాలని సూచించినట్లు ఆయన తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.