News

ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాలు ఉపయోగించడం పట్ల పోలీసుల విస్తృత ప్రచారం

కాకినాడ జిల్లాలో దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఎస్‌ సతీష్‌ కుమార్‌ ఆదేశానుసారం కాకినాడ క్రైమ్ డిఎస్పి రాంబాబు సూచనల మేరకు ఎల్ హెచ్ ఎం ఎస్ (Locked House Monitoring System) కెమెరాలు ఉపయోగించడం పట్ల పోలీసులు ఆటోలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా అరికట్టడంతో పాటు దొంగలను సులువుగా పట్టుకునేందుకు వీలవుతుందని పోలీసులు అవగాహణ కల్పిస్తున్నారు. ఎవరైనా తమ ఇంటికి తాళం వేసి దూర ప్రయాణాలకు వెళ్లే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారము తెలియజేయాల్సిందిగా సూచిస్తున్నారు. పండుగల నేపధ్యంలో ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్లదలస్తే సమీప పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేసినట్టైతే సంబంధిత పోలీసులు ఇంటిపై నిఘా పెట్టేందుకు కెమెరాలను అమర్చుతారు. ఈ సర్వీస్‌ పూర్తిగా ఉచితమని, ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని దొంగతనాలకు ఆష్కారం లేకుండా సహకరించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఆటోలో జనసమ్మర్థం కలిగిన ప్రాంతాల్లో మైక్‌ ప్రచారంతో ఏఎస్‌ఐ పుల్లయ్య, సిబ్బంది అవగాహణ కల్పిస్తున్నారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం