Kakinada

ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోలు పంపిణీ…

WhatsApp Image 2023-12-07 at 12.21.24 PM (2)

కాకినాడ కలెక్టరేట్లో బెనెట్ క్లబ్ వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాక్రమాన్ని నిరవహించారు. ఈ కార్యక్రమం సందర్బంగా ఉన్నతి పథకం కింద స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు 6గురికి జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా ఆటోలు పంపిణీ చేసినట్లు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఉన్నతి-మహిళా శక్తి పథకంతో మహిళలకు ఆదాయ వనరులు కల్పించే ఉద్దేశంతో ఆటోలు అందజేయడం జరిగిందన్నారు. పెదపూడి, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ మండలాలకు చెందిన వివిధ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.18.60 లక్షల విలువైన ఆరు ఆటోలను డీ.ఆర్.ఏ.-సెర్ప్ ద్వారా పంపిణీ చేసామని కలెక్టర్ తెలిపారు. ఇందులో 90 శాతం ప్రభుత్వ వాటా, 10 శాతం లబ్ధిదారులు వాటా అని తెలియచేశారు. ఈ ఆటోలు నడపడం ద్వారా తమ ఆదాయ వనరులు పెంపొందించుకోవడంతోపాటు భవిష్యత్తులో లోన్ సొమ్ము చెల్లించగలుగుతారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, డిపిఎంలు బి. వెంకటేశ్వరరావు, పి.అశోక్ భరత్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ