Education / Career Political

ఏమైంది ఏపీకి…!!

పాఠశాలలకు శెలవు… పరీక్ష వాయిదా…!!!

ఆంధ్రప్రదేశ్‌కి ఏమైంది… ముందెన్ననూ వినలేదు… చూడలేదు. ఉన్నట్టుండి స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం… పరీక్షలు వాయిదా వేయించడం… విద్యార్థులను మీటింగ్‌లకు తరలించడం. రాజకీయ పార్టీల మీటింగ్స్‌ విద్యార్థుల తోనే ముడిపడి ఉన్నాయా..? వారి ఉజ్వల భవిష్యత్‌ రాజకీయ జన సమీకరణకు దోహదపడుతుందా..? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితుల్లో అవుననే అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ విషయమై ప్రతిపక్షాలు, వామపక్షాలు నోరు మెదపకపోవటం విశేషం.

నెల 2, 3 తేదీలలో ఇంటర్మీడియట్‌ ఎథిక్స్‌ అండ్‌ హుమన్‌వేల్యూస్‌, ఎన్విరాన్మెంట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా 3 వ తేదీన నిర్వహించనున్న పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఈ పరీక్షను తిరిగి 23వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈనెల 3న ఏలూరులో ముఖ్యమంత్రి సభ జరగనున్న నేపధ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా పాఠశాలలు, కళాశాలలక సెలవులు ప్రకటించడం పరిపాటిగా మారిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.