అంగన్వాడీ సెంటర్స్ కి ఒంటిపూట బడులు నిర్వహించేలా ఐ.సీ.డీ.ఎస్. అధికారులు ఉత్తర్వులు ఇవ్వాలని ఏ.పి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పేర్లు యూనియన్ సీ.ఐ.టీ.యూ. కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. చంద్రావతి, జిల్లా కార్యదర్శి ఎం.కె. జ్యోతి, ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ప్రవీణ కి రెప్రెసెంటిషన్ ఇవ్వడం జరిగింది. వేసవి పెరిగి ఎండలు తీవ్రతరం ఐనందున అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, 3నుండి 5 సంవత్సరాలు లోపు ప్రీస్కూల్ పిల్లలు, అంగన్వాడీ లు ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నందన్నారు. దాని కారణంగా మార్చి 19నుండి జూన్ నెల వరకు అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట నిర్వహించేలా ఐ.సీ.డీ.ఎస్. అధికారులు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఒంటిపూట సెలవులు అంగన్వాడీ లకు ఇవ్వాలి… -సీ.ఐ.టీ.యూ.-
![WhatsApp Image 2024-03-19 at 4.30.32 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-19-at-4.30.32-PM.jpeg?resize=1280%2C700&ssl=1)