Culture

కాకినాడ జిల్లాలో జరగనున్న స్విమ్మింగ్ పోటీలు…

OIP (2)

కాకినాడ జిల్లాలో డిసెంబర్ 3 న కాకినాడ జిల్లా స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయని కాకినాడ జిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ తెలిపారు. స్విమ్మింగ్ జట్టు ఎంపికలు కాకినాడ సమీపంలోని వాకాడ గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరుగుతాయని ఆయన అన్నారు. గ్రూప్ వన్, టు, త్రీ, ఫోర్, ఫైవ్ లో బాలబాలికలకు పోటీలు నిర్వహస్తారని, ఈ పోటీలకు 2006 నుండి 2017 వరకు మధ్య వయసు బాలబాలికలు అర్హులని తెలిపారు. ఈ పోటీల్లో 1, 2, స్థానాల్లో గెలుపొందిన గ్రూప్ 1, 2, 3, వారిని డిసెంబర్ 16, 17 తేదీల్లో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్. కాలేజీ నందు జరగబోయే తొమ్మిదవ జూనియర్, సబ్ జూనియర్ వింటర్ అక్వాటిక్ చాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది