Kakinada

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు…

WhatsApp Image 2024-05-17 at 7.12.35 PM

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు ఎంపికయ్యారు. 2024-25 ఏడాదికి జరిగిన ఈ ఎన్నికల్లో అర్హులైన 980 మంది ఓటర్లకు గాను 680 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కె.వి. భద్రరావుకు 440 ఓట్లు రాగా, ప్రత్యర్థి సూదిన శ్రీనివాస్ కు 237 ఓట్లు వచ్చాయి. మూడు ఓట్లు అనర్హత ఓట్లుగా పరిగణించారు. భద్రరావు 223 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భద్రరావు 2020 -21లో ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2023-24, 2024-25 లో మరో రెండు సార్లు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

మొత్తం కాకినాడ బార్ అసోసియేషన్ ఉపఅధ్యక్షునిగా మూడుసార్లు ఎంపికై హ్యాట్రిక్ సాధించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. అధ్యక్ష కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా సీనియర్ న్యాయవాది టి.పి.ఆర్. చంద్రశేఖర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎస్.కే. అజాజిద్దీన్ వ్యవహరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ