Culture

కాకినాడ భోగిగణపతి పీఠంలో ఘనంగా జరిగినసైకత శివలింగార్చన…

Screenshot_20231127_161826

శోభకృత్ కార్తీకమాస ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ భోగిగణపతి పీఠంలో సైకతశివ లింగానికి సహస్రనామ పారాయణతోప్రత్యేకపూజాధికాలు చేశారు. ముందుగా 808వ గణపతిజప యజ్ఞంలో పంచామృతాభిషేకం జరిగింది. పీఠంలో స్వయంభువుకి కవచ థారణ, తిరుమల శ్రీవారి పాదుకల ప్రతిష్ట సందర్భంగా శివకేశవ ఆరాధనతో చేపట్టిన 8 వారాల అన్నసమారాధనను రెండవ సోమవారం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన జరగడం లోక కల్యాణకారకమన్నారు. 108 మంది ముత్తైదువులకు అన్నప్రసాదంతో తాంబూలాలు ప్రదానం చేశారు. సైకత శివలింగం భక్తులను విశేషంగా అలరించింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది