Viral

కొల్లేరు అభయారణ్యం పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్…!!!

WhatsApp Image 2024-02-18 at 7.27.55 PM

కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో ఎక్కడ అక్రమ చేపల చెరువులు త్రవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వన్య ప్రాణుల విభాగం డివిజనల్ అటవీ శాఖ అధికారిణి యం. హిమ శైలజ తెలిపారు. అందులో భాగంగా పైడిచింతపాడు, మల్లవరం, బొబ్బిలిలంక గ్రామాలలో పర్యటించడం జరిగిందన్నారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలో ఎటువంటి అక్రమ చేపల చెరువుల త్రవ్వకాలు జరపకుండా పటిష్టమైన నిరోధక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఇప్పటికే అటవీశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు.

ఆ పరిధిలో అక్రమ చేపల చెరువు త్రవ్వకాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కొల్లేరు అభ అరణ్య పరిరక్షణ కొరకు రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షణ అధికారి వారి ఆదేశాల మేరకు డివిజనల్ అటవీశాఖ అధికారి వన్యప్రాణుల విభాగం వారి అధ్యక్షతన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి రాజమండ్రి సర్కిల్ పరిధిలోని అటవీశాఖ అధికారులను, సిబ్బందిని ఏలూరు వన్యప్రాణుల విభాగం కార్యాలయంలో సమావేశపరిచి వారికు అభయారణ్యం పరిరక్షణపై తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.