ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఒక కేసు విచారణలో భాగంగా బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ ఇంటికి వెళ్లగా వారి దగ్గర గంజాయి దొరికింది. దానితో తనని తన సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని సంపత్ వినయ్ పై మోనిక అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానితో అతడిని విచారణ చేయడానికి పోలీసు అధికారులు తన ఇంటికి వెళ్లారు. ఇంట్లో తనిఖీలు చేయ్యగా గంజాయి బయట్లపడడంతో షణ్మక్ అతని తమ్ముడు సంపత్ వినయ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి దగ్గరున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.