ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎం.పీ. లు అనూహ్య మద్దతు పలికారు. బిల్లును కేవలం 72 మంది ఎం.పీ. లు వ్యతిరేకించగా.. ఏకంగా 780 మంది ఎం.పీ. లు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. మీ శరీరం మీది. మీ విషయంలో ఇతరులు నిర్ణయం తీసుకోలేరు అని ఓటింగ్ కు చట్టసభలో ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యానించారు. ఈ సందేశాన్ని ఇక్కడి నుంచి మహిళలు అందరికీ పంపుతున్నామని ఆయన అన్నారు. పార్లమెంట్ నిర్ణయాన్ని అక్కడి మహిళా హక్కుల సంఘాలు స్వాగతించాయి.