Exclusive

గొల్లప్రోలు లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్…

WhatsApp Image 2023-12-09 at 5.58.11 PM

గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్‌.సి.యమ్‌ చర్చ్ గ్రౌండ్ లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అత్యాధునిక కేన్సర్ పరీక్షలను సుమారు 300 మందికి ఉచితంగా మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేసారు.

ఈ క్యాంప్ లో డా. గోపాల్, డా. అమృత, డా. తన్మయి, దంత వైద్యులు హాసిని, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సభ్యులు, ట్రినిటి హాస్పటల్ సిబ్బంది వైద్య సేవలను అందించారు. పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రీస్తుసంఘ సేవకులు మడకి జోయల్ రాజు, వైసి త్రీ యూత్ వారిని పిఠాపురం శాసనసభ్యడు పెండెం దొరబాబు, నగర పంచాయితి కమీషనర్, తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమములో ఆర్‌.సి.యమ్‌ చర్చ్ ఫాదర్ బర్తలోమియా, కౌన్సలర్ బి. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.