Exclusive

గ్రూప్-2 ఫలితాలు త్వరగా విడేదల చేయండి… -ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ.-

58b9d941-02af-417b-8333-1f19755950b2

నాలుగు లక్షల పైబడి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-2 ఫలితాలు ఏప్రిల్ 6 వ తేదీన విడుదలవుతాయని చెప్పి ప్రకటించకపోవడం పై స్పష్టత ఇవ్వాలి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ డిమెండ్ చేసారు. 897 ఉద్యోగాలకు గాను 331 ఎగ్జిక్యూటివ్, 556 నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానాలకు తక్షణమే గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలు 1:100గా విడుదల చేయాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలకు దిగుతారని హేమంత కుమార్ తెలిపారు.

ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 6వ తేదీ లోపు విడుదల చేయబోతున్నట్లు కొన్ని దినపత్రికలో ప్రచారం చేశారని కానీ ఇప్పటిదాకా ఫలితాలు విడుదల చేయకపోవడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఫలితాలు 1:100గా విడుదల చేయాలని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. నిరుద్యోగ ఓదార్పు యాత్రలో చేసిన డిమాండ్లును ఏ.పీ.పీ.ఎస్.సీ. గౌరవించి 1:100 ప్రకటిస్తామని చూచాయిగా తెలియపరిచారన్నారు.

కానీ అధికారికంగా ఫలితాలు విడుదల చేస్తే గాని అభ్యర్థుల లో ఆందోళన తగ్గదన్నారు. గ్రూప్-2 ఫలితాలు ఇంకా తయారు కాకపోతే ప్రకటించండి కానీ మరింత ఆలస్యం చేస్తే ప్రధాన పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు చదువుకోవడానికి సమయం లేక నష్టపోతారని హేమంత్ హెచ్చరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.