Political

చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు పై కొండబాబు ఆగ్రహం..

van

చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో గత 34 రోజులుగా రిలే నిరాహారదీక్షలు నిర్వహించి అనంతరం దీక్షలకు ముగింపు పలికి నేరుగా ప్రజాక్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడం లో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్డు ప్రాంతంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలను నేరుగా సందర్శించి చంద్రబాబునాయుడు కి జరిగిన అన్యాయాన్ని రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కొండబాబు వివరించారు.
ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలను ప్రపంచం గర్వించే విధంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ని వైకాపా ప్రభుత్వం అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అందరి మన్నలను పొందిన చంద్రబాబు నాయుడు ని ఇబ్బందులకు గురిచేసి తిరిగి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారని కొండబాబు తెలిపారు.
అయితే గత 30 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కుట్రపూరిత వాతావరణాన్ని ప్రజలు గమనిస్తున్నారని కావాలనే చంద్రబాబును తప్పుడు కేసులు ఆధారాలు చూపించలేని పరిస్థితుల్లో జైలు పాలు చేయడం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిందన్నారు. రానున్న రోజుల్లో తిరిగి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్లు ఓమ్మి బాలాజీ, తుమ్మల రమేష్, బచ్చు శేఖర్ తదితరులు ఉన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.