జిల్లా స్థాయి 31 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2023 ఈ నెల 9, 10 తేదీలలో కాకినాడ లో ఎమ్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారిణి జి. నాగమణి ఒక ప్రకటన లో తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతికండలి మరుయు పాఠశాల విద్యాశాఖ అధ్యర్యం లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాలల సైన్స్ కాంగ్రెస్ గోడ పత్రిక ను తన కార్యాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఆన్ లైన్ రిజిస్టేషన్ చేసుకున్న ప్రాజెక్టులు జిల్లా స్థాయి ప్రాజెక్టుల కాంపిటీషన్ నందు పాల్గొనాలని తెలిపారు.
అసిస్టెంట్ డైరక్టర్ పీ. నాగేశ్వరరావు మాట్లడుతూ… విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి, పర్యవరణం పై స్పృహను పెంచడానికి బాలల సైన్స్ కాంగ్రెస్ సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాకినడ అర్బన్ డీ.ణ.వీ.పీ.జీ వాణి కుమారి, జిల్లా సైన్స్ అధికారి ఎమ్. శ్రీనివాస వినీల్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయ కర్త కేసరి శ్రీనివాస రావు, పీ.వీ.వీ సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ను జయప్రదం చేయండి….
![WhatsApp Image 2023-11-01 at 6.44.48 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-01-at-6.44.48-PM.jpeg?resize=1280%2C622&ssl=1)