International

టీ.టీ.వీ. ని తేని రేసు నుంచి తప్పించే ప్రయత్నం విఫలం…

vvt-sashikala

మధురై లోని థేని నియోజకవర్గానికి డీ.ఎం.కే. అభ్యర్థి తంగ తమిళ్‌సెల్వన్, అన్నాడీఎంకే అభ్యర్థి వీటీ నారాయణస్వామి గురువారం బీ.జే.పీ., ఎం.ఎం.కే. అభ్యర్థి టీ.టీ.వీ. దినకరన్‌ నామినేషన్‌ను రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారి ఆర్‌.వి. శజీవనను కోరారు. సార్వత్రిక ఎన్నికల పరిశీలకుడు గౌరంగ్‌భాయ్‌ హెచ్‌ మక్వానా, వివిధ పార్టీల కార్యకర్తల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి శజీవన దాఖలు చేసిన పత్రాలను పరిశీలించారు.

ఆ సమయంలో తమిళసెల్వన్, నారాయణసామి ఇద్దరూ తమ మద్దతుదారులతో కలిసి దినకరన్ నామినేషన్‌ను రద్దు చేయాలని ఆర్.ఓ. ని కోరారు. ఈ.సీ.ఐ. వెబ్‌సైట్‌లో అతని అఫిడవిట్ కనుగొనబడలేదు అని ఆరోపిస్తూ… అతని ఆస్తికి సంబంధించిన పత్రాలను, ఏదైనా క్రిమినల్ కేసుల వివరాలను ధృవీకరించడానికి కొంత సమయం అవసరమని తెలిపారు.

అయితే ఇద్దరు అభ్యర్థులు భారత్, సింగపూర్‌లో దినకరన్ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని, పుదుచ్చేరిలోని తన ఆస్తుల వివరాలను వదిలిపెట్టారని ఆరోపించారు. పరిశీలన తర్వాత, ఆర్.ఓ. శజీవన వారి అభియోగాలను కొట్టివేసారు. ఖచ్చితమైన సాక్ష్యాలను అందించాలని కోరారు. పత్రాలను అందించడంలో విఫలమైతే కోర్టును ఆశ్రయించాలని డీ.ఎం.కే. మద్దతుదారులను కూడా ఆమె కోరారు. ఎట్టకేలకు దినకరన్‌ నామినేషన్‌ను ఆమోదించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News International

పాలస్టీనాపై జరుగుతున్న దాడులపై నిరశన

అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ
IMG-20231027-WA0048
News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో