రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిశ మెగా డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎస్.పీ. శ్రీధర్ ఐ.పి.ఎస్., అదనపు ఎస్పీ ఖాదర్ బాషా గార్ల ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలో దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కోనసీమ జిల్లా దిశా డి.ఎస్.పీ మురళీమోహన్, అమలాపురం డి.ఎస్.పి. ఎం. అంబికా ప్రసాద్, రామచంద్రపురం డిఎస్పి .టి ఎస్ ఆర్ కే ప్రసాద్ లు జిల్లా పోలీసు సిబ్బంది తో మరియు మహిళా పోలీసులతో దిశా యాప్ రిజిస్ట్రేషన్స్ చేయించినట్లు చెప్పారు. ఒక్కరోజులోనే 22,000 పైగా Disha app రిజిస్ట్రేషన్ చేయించినట్లు దిశా డి.ఎస్.పి. మురళీమోహన్ తెలియజేసినారు.