Tamil Nadu

తమిళనాడులో 20 స్థానాలలో బీ.జే.పీ. పోటీ…

OIP (33)

తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు బీ.జే.పీ. నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్‌.డీ.ఏ. గురువారం సీట్ల పంపకాన్ని ఖరారు చేసింది. మొత్తం 39 స్థానాల్లో బీ.జే.పీ. 20 స్థానాల్లో పోటీ చేయనుండగా, 19 సీట్లు మిత్రపక్షాలకు దక్కనున్నాయి. మరో నాలుగు నియోజకవర్గాల్లో బీ.జే.పీ. కి చెందిన కొన్ని మిత్రపక్షాలు ఆ పార్టీ ‘కమలం’ గుర్తుపై పోటీ చేయనున్నాయి.

దీంతో మొత్తం 24 స్థానాల్లో బీ.జే.పీ. కమలం గుర్తుపై అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా బీ.జే.పీ. కి మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం నేతృత్వంలోని వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. మరోవైపు సీట్ల పంపకాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు పన్నీర్‌సెల్వం తన మద్దతుదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించవచ్చని అయితే శుక్రవారం బీ.జే.పీ. నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇవ్వవచ్చని వర్గాలు తెలిపాయి. బీ.జే.పీ. ప్రధాన కార్యాలయంలో విలేకరులతో టీ.ఎన్‌. బీ.జే.పీ. చీఫ్‌ అన్నామలై మాట్లాడుతూ… బీ.జే.పీ. నేతలు 24 మంది అభ్యర్థుల జాబితాతో న్యూఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చించనున్నారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-12-04 at 6.14.50 PM
Tamil Nadu

చెన్నై లో నిలిచిపోయిన విమాణం రాకపోకలు…

మిచౌంగ్ తఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం లో భారీ నుంచి అతి భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తునేవున్నాయి. దీని వలన తమిళనాడులో రాకపోకలు నిలిచిపోయాయి.
img_114289_mukesh_ambani
Tamil Nadu

బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న అంబానీ…

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌తో భాగస్వామ్యంతో తన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో మార్కెట్లోకి వచ్చే వారం చెన్నైలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు బిలియనీర్