Kakinada

తల్లిదండ్రులే పిల్లలను అదుపు చెయ్యాలి… -మైత్రీ సంభాషణా సదస్సులో సీ.ఐ. పిలుపు-

WhatsApp Image 2023-11-14 at 6.43.36 PM

ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో అధికంగా యువకులు మాత్రమే మృతి చెందడం, కాళ్ళు, చేతులు పోగొట్టుకోవడం జరుగుతున్నందున వారిని ప్రమాదాల భారిన పడకుండా అదుపుచేసే విషయంలో తల్లిదండ్రులు భాధ్యత తీసుకోవాలని సామర్లకోట సీ.ఐ. కే. దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. సామర్లకోట బలుసుల పేటలో మైత్రీ సంభాషణా అవగాహనా సదస్సు సీ.ఐ. ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీ.ఐ. మాట్లాడుతూ… స్థాయికి మించి పిల్లల ఆనందం కోసం మోటార్ సైకిల్లను, సెల్ఫోన్లను, ఇతర వసతులను వారికి కల్పించడంతో యువత హద్దూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా నెలకు సగటున రోడ్డు ప్రమాదాల కారణంగా 30 మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, మరో 70 నుంచి 100 మంది యువకులు కాళ్లు చేతులు పోగొట్టుకుని శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారని ఆయన అన్నారు.
సామర్లకోట పరిధిలో పరిశీలిస్తే 2022 సంవత్సరంలో సామర్లకోట రైల్వే ఓవర్ బ్రిడ్జి మొదలు పెదబ్రహ్మదేవం గ్రామం వరకు జరిగిన ప్రమాదాల్లో 24 మంది యువత మృతి చెందారన్నారు. ఇంకా సుమారు 40 మంది పైబడి యువకులు కాళ్లు, చేతులు పోగొట్టుకుని అంగవైకల్యులయ్యా రన్నారు. దానికి కారణం డ్రైవింగ్ రాకపోయినా, లైసెన్సులు లేకపోయినా వాహనాలను నడపడమే కారణమన్నారు. ఈ విషయంలో కుటుంబాల్లోని తల్లిదండ్రులు గాని పెద్దవారు గానీ యువతకు అర్థమయ్యే రీతిలో ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ