Kakinada

తుఫాన్ తో నిర్మానుస్యంగా మారిన సామర్లకోట…

WhatsApp Image 2023-12-05 at 5.29.06 PM

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో సామర్లకోట మండల పరిధిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగాఎడతెరుపు లేకుండ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటిమయమయ్యాయి. దీనితో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుఫాన్ కారణంగా ప్రజలు బయటకు రాకపోవడంతో పట్టణాలు, గ్రామాలు నిర్మానుస్యంగా మారాయి. సామర్లకోట జగనన్న కాలనీలో డ్రైన్ల సదుపాయం పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గత రెండు రోజుల వర్షాలకు కాలనీ అంతా జలమయమైంది.

ప్రజలు కనీసం అడుగు తీసి బయట పెట్టలేని విధంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా పట్టణ పరిధిలో జగనన్న కాలనీ, భాస్కర్ నగర్, సాయి నగర్, తెనుకుల పుంత, ఆర్టీసీ బస్టాండ్, ప్రెసిడెంట్ గారి వీధి, వెలమ వీధి, తదితర ప్రాంతాలు భారీ వర్షాలకు జలమయ్యాయి. దానితో ఇటు ప్రజలతో పాటు ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ లోనికి వచ్చేందుకు వీలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ