News Political

తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం

23న మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్‌లో నాయకుల బేటీ

2024లో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం – జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో జనసేన పార్టీ అధినేత, వర్థమాన సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీతో చర్చలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీలో ఎవరు ఉండాలన్నది కూడా పూర్తవడంతో ఇరుపార్టీల ముఖ్యులతో సమావేశానికి విదయ దశమి పర్యదినం ముహూర్తంగా నిర్ణియించారు.

రాజమండ్రిలోని మంజీరా హోటల్‌లో 23 అక్టోబర్‌ మధ్యహ్నం 3 గంటలకు సమన్వయ కమిటీ సమావేశం కానున్నారు. పార్టీ ముఖ్య నేతలు పవన్‌ కళ్యాణ్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శ నారా లోకేష్‌ ఈ బేటీలో కీలక భూమిక పోషించనున్నారు. సీట్ల సర్ధుబాటు, ముఖ్యమంత్రి స్థానంపై ఒక నిర్ణయానికి ఇరుపార్టీలు రావాల్సి ఉంటుంది. అనేక సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి స్థానం ఇరుపార్టీలకు రెండున్నరేళ్ల చొప్పున అంగీకారమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే జనసేన పార్టీతో పొత్తు ఉన్నట్టు బాహాటంగానే ప్రకటించింది. మరోపక్క వైఎస్‌ఆర్‌సీపీ తో సన్నిహితంగా, ముఖ్యమంత్రి జనగ్‌మోహన్‌రెడ్డికి అండగా బీజేపీ కేంద్రంలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పొత్తుల వ్యవహారంపై కూడా స్ఫష్టతకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.