News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

  • సినీ హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలైన సందర్భంగా గుంతకల్లు రూరల్ మండలం కసాపురం ఆంజనేయస్వామి దేవాలయంలో ఆకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో పనిచేస్తున్న తాను గుంతకల్లు వాసినన్నారు. అత్యధిక శాతం గుంతకల్లులో చేనేత సామాజిక వర్గం ఉందని, పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.