Culture

తోలుబొమ్మలాట కళను కాపాడండి… -జీవశాస్త్ర ఉపాధ్యాయులు గోవిందరాజు-

WhatsApp Image 2024-03-19 at 3.30.35 PM

ప్రపంచంలో అతి పురాతన కళలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. పూర్వం అశోకుని కాలంలో శివాజీ పరిపాలించే సమయంలో, భాగవతంలో భరతుడు రాసిన నాట్య శాస్త్రంలో ,శ్రీకృష్ణదేవరాయల కాలంలో, తోలుబొమ్మలాట గురించి ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి కళ అంతరించిపోకుండదనే ఉద్దేశంతో కాకినాడ జిల్లాకు చెందిన మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నూకాలమ్మ గుడి చందుర్తి పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి. గోవిందరాజులు అనేక రకాల తోలుబొమ్మలు తయారుచేసి పాఠాలను బోధిస్తున్నారు.

 

జీవవైవిద్యాన్ని సంరక్షించాలని ఉద్దేశంతో జంతు చర్మాలకు బదులుగా ప్లాస్టిక్ షీట్లతో తోలుబొమ్మలను తయారుచేసి విద్యార్థులకు బోధించడం పాఠ్యాంశాలు, కథలు, గేయాలు, చిన్న చిన్న నాటికలను విద్యార్థులచే చేయిస్తున్నారు. వాటిని ఉదయం ప్రార్థన సమయాలలోనూ జాతీయ దినోత్సవాలలోను, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రజలను, విద్యార్థులను చైతన్యపరిచి తన వంతు కృషి చేస్తున్నారు. నిష్టా అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటప్పుడు బొమ్మల ఆధారిత విద్య గురించి తోలుబొమ్మల పాత్ర విద్య విధానంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయన లైవ్ లో వివరించారు.

రాష్ట్రస్థాయిలో తోలుబొమ్మల ప్రదర్శన పోటీలను నిర్వహించారు. దీనిలో ప్రధమ బహుమతిని పి. గోవిందరాజులు తయారుచేసిన తోలుబొమ్మలకు దక్కింది. వీటిని జాతీయస్థాయిలో జరిగే ఇండియన్ టాయ్ ఫేర్ కి ఎంపిక చేసారన్నారు. పి.ఎం. నరేంద్ర మోడీ ఆన్లైన్లో, విర్చువల్లో ఏ.పీ. కి చెందిన పపెట్ లను వీక్షించివాటిలో గోవిందరాజులు తయారుచేసిన పప్పెట్స్ కూడా ఉన్నాయి. ఎన్.సి.ఆర్.టి. జాతీయస్థాయిలో నిర్వహించిన పప్పెట్రీ షార్ట్ ఫిలిం పోటీలలో ఉపాధ్యాయుల విభాగంలో గోవిందరాజులుకు ద్వితీయ బహుమతి, విద్యార్థుల విభాగంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి కూడా దక్కింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది