Exclusive

నీట్ పరీక్షా ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలి…

fc4b62cb-20f1-4d5a-9534-c9f3ab54b897

అఖిల భారత విద్యార్థి సమాఖ్య కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని పి.ఆర్. భవన్ నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. శివారెడ్డి మాట్లాడుతూ… నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం అందులో ఆ ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తున్నదన్నారు.

తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారన్నారు. అనంతరం రాజకీయ పాఠశాల కరపత్రాలను ఏఐవైఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు .

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.