Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

electrical

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా మంగళవారం నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. దసరా సందర్బంగా విజయవాడ లో ఉన్న కనకదుర్గమ్మ దర్శనార్ధమై వచ్ఛే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని 5,500 బస్సు లను నడుపుతున్నామని తెలియజేసారు.

గత దసరా పండుగలో 50 శాతం ఛార్జీలు పెంచడం జరిగిందని, దానికి స్వస్తి పలికామని చెప్పారు. వచ్చీ పోయే ప్రయాణికులకు 10 శాతం రాయితీని కలిపించామన్నారు. రాయితీ లు కల్పించి ఓఆర్ ఆదాయ పేంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేసారు. మరొక 1,500 కొత్త డీజిల్ బస్సు లు కొనుగోలు చేస్తున్నామన్నారు.

ఈ సంవత్సరం వెయ్యి కొత్త ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలు చేశామని, ఇంకో మూడు నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో కి వస్తాయని తెలియచేసారు. పీఎఫ్ బకాయిలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి, హయ్యర్ పెన్షన్ ఇచ్చెందుకు దోహదపడుతుందన్నారు. ఈ సందర్బంగా డిపో ఆవరణలో మొక్కలు నాటారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.
varma
Political

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కౌంటర్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ ఘాటుగా స్పంధించారు. జనసేన పార్టీ అధినేత వర్థమాన సినీ నటుడు పవన్‌