Viral

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… 6రు దుర్మరణం…

OIF (2)

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరులోని కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని వెనక నుంచి మరో లారీ వేగంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఆ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చేందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతులను, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.  ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెళ్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.