Trending News

న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉప సంహరించుకోవాలి…

Ap-districts

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడపాటి ధర్మారెడ్డి, గుదిమెళ్ళ శ్రీ భాస్కరాచార్యులు, కాకినాడ సిటీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పీ. రాంచంద్ర రాజు, కే. నాగ జ్యోతి పత్రిక ప్రకటన విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు.
సామాన్యులకు అన్యాయం జరిగేందుకు ఆస్కారం ఉందన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ చట్టంలో స్థానిక సివిల్ కోట్లకు విచారణ పరిధి( జ్యూరిడిక్షన్) లేకుండా చేశారన్నారు. కేవలం టైటిలింగ్ అధికారులకే అధికారం కట్టబెట్టా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టైటిలింగ్ యాక్ట్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బార్ అసోసియేషన్ తో కలిసి పోరాడుతామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్