Kakinada

పంట పొలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించాలి… -తాటిపాక మధు డిమాండ్-

WhatsApp Image 2023-12-06 at 5.22.55 PM

మిచ్చాంగ్ తుఫాన్ కు గురయిన కాకినాడ జిల్లాలో సామర్లకోట,జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, పంట పొలాలను సిపిఐ జిల్లా బృందం పరిశీలించింది. చేతికి అందించిన రైతు పంటలు నేలపాలై కాకినాడ జిల్లాలో రైతాంగం కన్నీరు ఆలపిస్తున్నారని తక్షణమే తడిసిన ధాన్యాన్ని వెంటనే కనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కే. బోడకొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సి.పి.ఐ. బృందం ముందు రైతులు చేతికొచ్చిన పంట ఎలా పోయిందో ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో వారి ఆవేదనను వివరించారు
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలకు ఆచరణలకు పొంతనలేదని ఆయన విమర్శించారు. ఈ జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు ఏమీ పని చేయడం లేదని కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయడం లేదని ఆయన అన్నారు. మరోపక్క జిల్లా వ్యవసాయ అధికారులు మండల అధికారులు తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవాలని సలహాలు ఇస్తున్నారని రైస్ మిల్లర్లు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారని రైతుల కష్టాన్ని మిల్లర్లు దోచుకుంటున్నారని మధు అన్నారు. ఈ పర్యటనలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మడగల రమణ, రైతు సంఘం నాయకులు అర్జున్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ