International

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన…

WhatsApp Image 2023-11-01 at 8.20.33 PM

పాలస్తినా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు నిరసనగా సీ.ఐ.టీ.యు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ.టీ.యు. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ… మొదటి ప్రపంచ యుద్ధం లో పాలస్తీనాకు వలస వచ్చిన ఇజ్రాయిల్ ప్రజలు కాలక్రమేనా పాలస్తీనాను సగభాగంపైన ఆక్రమించి నేడు పాలస్తినా ప్రజానీకంపై దాడులు చేసి సుమారు 8,500 మంది పైన అమాయక ప్రజానీకాన్ని చంపడం దారుణమన్నారు. ఐక్యరాజ్యసమితి లోని 160 దేశాలు యుద్ధాన్ని ఆపాలని కోరినా ఇజ్రాయిల్ అమెరికా అండదండలతో ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడటంతో అనేకమంది ప్రజలు మృతి చెందుతున్నారన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని ప్రపంచ శాంతికి యావన్మంది ప్రజానీకం మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యు. మండల కార్యదర్శి నరవ సురేష్ కుమార్, సీ.హెచ్. మహేశ్వరరావు, బాలం హరిబాబు, మిల్కీ సదక్, కరణం రామకృష్ణ, తుంపాల శ్రీనివాస్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News International

పాలస్టీనాపై జరుగుతున్న దాడులపై నిరశన

అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ
IMG-20231027-WA0048
News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో