Culture

ప్రజలను అలరించిన వేణు గానం…

WhatsApp Image 2024-02-17 at 5.07.14 PM

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి లో జరుగుతున్న నవమ వార్షిక మాస దీక్ష సూర్యారాధన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్వాంసులు ప్రదర్శించిన కచేరి కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చారు. సౌర యాగంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీ సవితృ కళావేదికపై వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ఇస్తున్నారు.

దీనిలో భాగంగా శనివారం ప్రముఖ వేణు గాన విధ్వాన్సులు భైరవభట్ల సుబ్రహ్మణ్య శర్మ ఇచ్చిన వేణు గాన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. వీరికి ప్రముఖ వైలన్ విద్వాంసులు పాలపర్తి ఆంజనేయ శాస్త్రి, మృదంగం కాపవరపు సుబ్బారావు వాయిద్య సహకారం అందించారు. మార్చి 9వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం జరగనున్న సంగీత కచేరి కార్యక్రమాలను వీక్షించేందుకు సంగీత ప్రియులు రావలసినదిగా యాగ నిర్వాహకులు గొర్తి గోపాలకృష్ణ కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది