Culture

ప్రజలు మెల్కొని… కాకినాడ సంపదని కాపాడాలి…!!! -డాక్టర్ రాజేంద్ర సింగ్-

WhatsApp Image 2024-02-01 at 6.51.21 PM (1)

విశ్వశక్తి కలిగిన కాకినాడ నగరం వినాశనం వైపు పయణించడం ఆందోళన కలిగించే అంశంగా ప్రజలు మెల్కొనాలని ఉన్న పురాతన సంపదను రక్షించుకోవాలని రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు వరదలు నివారణనకు కృషి చేయాలని అన్నారు.

కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను పిడబ్ల్యూసిడిఎఫ్ కో- ఆర్డినేటర్ ప్రెసింగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.కాకినాడలోని చారిత్రాత్మక గల ఎంఎస్ఎన్ చారిటీస్ భూములను, ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారని అది తనకు చాలా బాధాకరంగా ఉందన్నారు.

చారిత్రక కట్టడాలు, సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణం వంటి వారసత్వ సంపద సమాజం మొత్తానికి చెందుతుందని వీటిని పరిరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలన్నారు. ఈ చర్చ కార్యక్రమంలో జేఎన్టీయూ కె ప్రొఫెసర్లు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, పి శివశంకర్, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కే మృత్యుంజయరావు, చిక్కాల దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది