Trending News

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి…

Andhra-govt-employees-threaten-strike-over-pay-revision

ప్రభుత్వం నుండి ఉద్యోగుల డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేనందున ఈ నెల 20వ తేదిన భారీ ఎత్తున మహా ధర్నా మరియు ర్యాలి జరపబడునని కావున భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికులు , పెన్షన్నర్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుములల నుండి రావాలని ఏ.పీ. జె.ఎ.సి. రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.పీ. జే.ఏ.సీ. ఛైర్మన్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ… ఉద్యోగులకు రావలసిన ఎస్.ఎల్., జి.పి.ఎఫ్. లోన్స్, ఏ.పీ. జి.ఎల్.ఐ., డి.ఏ. బకాయిలు, అన్నీ వెంటనే విడుదల చేయాలని మరియు 12వ పి.ఆర్.సి. 30% ఐ.ఆర్. వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకయల వెంకట కృష్ణ, ఆర్&బి రాష్ట్ర అధ్యక్షులు మునికేషులు , జిల్లా శాఖల నుండి ట్రెజరీ శాఖ సంఘం అధ్యక్షుడు పాము శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్