Trending News

ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో జిల్లా రెవెన్యూ అధికారి భేటీ…

WhatsApp Image 2024-03-18 at 5.42.22 PM

రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు రాజకీయ నాయకుల ప్రచారాలకు ఉపయోగించే కరపత్రాలు, గోడ పత్రికలను ముద్రించాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. తిప్పే నాయక్ అన్నారు. 2024 లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి షేడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లో డీఆర్వో తిప్పే నాయక్ జిల్లా పౌర సంబంధాల అధికారి డీ. నాగార్జనతో కలిసి జిల్లాలోని వివిధ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు.

రానున్న ఎన్నికల్లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా డీఆర్వో తిప్పే నాయక్ మాట్లాడుతూ… కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు రానున్న మే నెల 13న ఎన్నిక జరగనుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షేడ్యూల్ విడుదల చేసిందని ఆయన అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వాతంత్ర అభ్యర్థుల ఉపయోగించే కరపత్రాలు, గోడ పత్రికలు ఇతర ప్రచార పత్రాలను ముద్రించాల. గోడపత్రికలు కరపని అన్నారు. పత్రికలకు సంబంధించిన సైజ్, ధర, కాపీల సంఖ్య వంటి అంశాల్లో తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. వివిధ ప్రింటింగ్ ప్రెస్ లలో ముద్రించిన వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచార పత్రాలను ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని డీఆర్వో తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్