Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో తెరకెక్కించిన “పులివెందుల పులిబిడ్డ” చిత్రానికి సంబంధించిన ప్రచార పోస్టరును రాజమండ్రి ఎం.పీ. మార్గాని భరత్ రామ్ ఆవిష్కరించారు. ఎం.పీ. నివాసం వద్ద జరిగిన పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు పేర్నపాటి విష్ణు, హీరో ప్రహ్లాద్, హీరోయిన్ ఐశ్వర్య గోల్డ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.పీ. మాట్లాడుతూ… సమాజానికి సందేశం ఇచ్చే విధంగా తీసిన పులివెందుల పులిబిడ్డ చిత్రంలో ప్రభుత్వ‌ సంక్షేమ పథకాలు కూడా ప్రచారం చేయడం అభినందనీయమన్నారు.
ప్రేమతో ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు రావడానికి హీరో హీరోయిన్లు ఏంచేశారనేది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చెప్పడం గొప్ప విషయమని అన్నారు. కొత్తవారితో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఎం.పీ. ఆకాంక్షించారు. దర్శకుడు పేర్నపాటి విష్ణు మాట్లాడుతూ… కళావతి మూవీస్ పతాకంపై నిర్మించిన ఈచిత్రం ఈనెల 17 న ఫైబర్ నెట్ తో పాటు థియేటర్లలో కూడా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎం.పీ., సీ డెడ్ డిస్ట్రిబ్యూటర్ మల్లికార్జునరావు, ఎం. భాస్కర్, ఎ.విజయారావు, రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM
Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ
WhatsApp Image 2023-11-29 at 5.31.20 PM
Movies

ప్రజలలో చైతన్యం నింపే దిశగా సినిమా నిర్మాణం… -దర్శకుడు పీ. సత్యారెడ్డి-

జనం ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఉక్కు సత్యాగ్రహం సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు పీ. సత్యారెడ్డి తెలిపారు. సినిమా నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా కాకినాడలోని స్థానిక హోటల్లో