హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట ఘటనపై సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా స్పందిచారు. ఆయన మాట్లాడుతూ… ఈ ఘటన విని తాను కృంగిపోయానని, బాధిత కుటుంబాలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలని కోరారు. 121 మంది ప్రాణాలను బలిగొన్న జూలై 2 హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ న్యూఢిల్లీలో పోలీసుల ముందు లొంగిపోయిన కొన్ని గంటల తర్వాత శనివారం భోలే బాబా వార్తా సంస్థ కి చేసిన ప్రకటన వచ్చింది. అనంతరం అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.