కాకినాడ లో జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో కరప కు చెందిన హై స్కూల్ విద్యార్థినులు తన ప్రతిభను చాటారు. జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ పోటీలలో కరప విద్యార్థినులు రూపొందించిన మానసిక పిల్లలు పుట్టుక కారణాలు, పరిష్కారం అనే ప్రాజెక్ట్ ఉత్తమంగా ఎంపికయ్యింది. జిల్లా వ్యాప్తంగా 260 ప్రాజెక్ట్ లు ప్రదర్శించగా రాష్ట్ర స్థాయికి ఏడూ మాత్రమే ఎంపిక కాగా అందులో కరప విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్ట్ ఒకటిగా నిలిచింది. ఈ నెల 29, 30 తేదీలలో గుంటూరు లోని కే.ఎల్ యూనివర్సిటీ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఈ ప్రాజెక్ట్ ఎంపికయినట్లు గైడ్ టీచర్ మడికి సుదర్శన బాబు, హెచ్.ఎం యూ. లీలామనోహర్ లు తెలిపారు.
బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో ప్రతిభ చూపిన కరప విద్యార్థినులు…
![OIP (8)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/OIP-8.jpg?resize=474%2C237&ssl=1)