Andhra Pradesh

బాల్య వివాహాల నిర్మూలనే మా లక్ష్యం…. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

WhatsApp Image 2023-10-16 at 4.38.25 PM

బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా బాల్య వివాహ నిరోధక మరియు పోక్సో చట్టాల ప్రకారం విధించే శిక్షల మీద కూడా సమాజంలో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ లు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారి నుండి రెవెన్యూ, సర్వే, సామాజిక భద్రత పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమర్పించిన 233 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సూచనల మేరకు బాల్య వివాహాల రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా మాస్ ప్రతిజ్ఞ చేయించాలని ఆదేశించామన్నారు. ముఖ్యంగా వరుడి తల్లిదండ్రులు మరియు వధువు యొక్క తల్లి దండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చునని సూచించారు.
చట్టం ప్రకారం ఎవరైనా పురుషుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ బాలికను వివాహం చేసుకుని, తనతో సంసా రం చేసినట్లైతే బాల్య వివాహ చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. బాల్య వివాహ నిషేధ చట్ట ప్రకారం మైనర్ బాలికను వివాహం చేసుకున్న వరుడికి జరిమానా, శిక్షలు విదించే అవకాశముందన్నారు. ఫోక్సోసవరణ చట్టం ప్రకారం 18 సం.లు లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జరిమానా, జీవిత ఖైదు కూడా విధించే అవకాశ ముoద న్నారు. ఈ చట్టాల ప్రకారం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే, జరిమానా లేదా జీవితాంతం జైలు శిక్ష విధించబడే అవకాశముoదన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం