National

RCPI బిష్ణు ప్రసాద్ రావాకు నివాళులు …

WhatsApp Image 2024-01-31 at 3.38.33 PM

తొలి తరం కమ్యూనిస్టు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్.సీ.పీ.ఐ. నేత బిష్ణు ప్రసాద్ రావా 115 వ జయంతి సందర్భంగా కాకినాడ కార్యాలయంలో పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… భారతదేశంలో 15 ఆగస్ట్ 1947న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రావా తన సహచరులతో కలిసి తమ చేతుల్లో నల్లజెండాలతో “యే ఆజాదీ ఝూతీ హై” అని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్.సీ.పీ.ఐ. భారతదేశ నిజమైన స్వాతంత్ర్యం కోసం వారి హక్కుల కోసం పోరాడుతుందన్నారు. కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రావా స్ఫూర్తితో ముందుకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. నాగమణి, కాకినాడ జిల్లా కార్యదర్శి డి. నారాయణమూర్తి, సహాయ కార్యదర్శి మంగ, బి. పద్మావతి, బొత్స యేసు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

1000037740
National

పిఆర్ఓ కె. రవి ని సన్మానించిన సహాయ పౌర సంబంధ ఆధికారులు..

సంక్షేమ పధకాల అమలులో సహాయ పౌర సంబంధ అధికారిగా కె. రవి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని సమాచార శాఖ డిప్యూటీ డెరైక్టర్ డి. నాగార్జున కొనియాడారు. డివిజనల్
Life Style National

‘Meri Saheli’ teams ensure safety of women travelers throughout their train journey

Railway Protection Force takes initiative Making Rail Travel safer for Women in alignment with the Prime Minister’s vision of empowering