Political

బీజేపీ నేతల మీద కేసు డిస్మిస్‌…

WhatsApp Image 2023-11-06 at 9.20.22 PM

2019లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయను అడ్డుకున్నారనే ఆరోపణతో 11 మంది భారతీయ జనతా పార్టీ నాయకుల మీద సర్పవరం పోలీసులు నమోదు చేసిన కేసును జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (మొబైల్ )వారు కొట్టి వేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుల తరపున పార్టీ న్యాయవాదులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, ముత్తా వెంకన్న, పెండెం శ్రీదేవి న్యాయస్థానంలో వాదన వినిపించారు.
పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో భారతీయ జనతా పార్టీ నేతలు రంబాల వెంకటేశ్వరరావు, చిట్నీడి శ్రీనివాస్, దువ్వూరి సుబ్రహ్మణ్యం, కొక్కిలిగడ్డ గంగాధర్, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న , నల్లబెల్లి సుజాత, కోరాడలక్ష్మీ తులసి, ముసలిగంటి సురేష్, ఏడిద కృష్ణ, సత్తి గోపాలకృష్ణ ,కరెట్ల చక్రధర్ రావు లు ఉన్నారు. న్యాయస్థానం కేసు కొట్టి వేసిన అనంతరం బిజెపి జిల్లా మీడియా ప్యానల్ దువ్వూరు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానిస్తూ పాలకుల మెప్పుకోసం ప్రతిపక్ష నాయకుల మీద పోలీసులు కేసులు నమోదు చేసి కొంతమేర ఇబ్బంది పెట్టవచ్చు గాని న్యాయస్థానంలో ఇటువంటి కేసులు నిలువని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.