Exclusive

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలి…

e2f63170-9b18-47b9-ae4f-5d23d05eecbf

స్వాతంత్రం సాధించిన విజయాలను, రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడమే విప్లవీరులు భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్, ఇచ్చే నిజమైన నివాళి అని సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధుపిలుపునిచ్చారు.

దేశ ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నివాళుల కార్యక్రమాలు జరిగాయి . శనివారం ఉదయం స్థానిక కూరగాయలు మార్కెట్ వద్ద భగత్ సింగ్ విగ్రహానికి సి.పి.ఐ., ఏ.ఐ.టి.యు.సి., ఏ.ఐ.ఎస్.ఎఫ్., ఏ.ఐ.వై.ఎఫ్. ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు

ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి తాటిపాక మధు, కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ… ఈ దేశ స్వతంత్రం కోసం ఉరితాడును ముద్దాడిన విప్లవ వీర కిశోరాలు భగత్ సింగ్ చరిత్రను నేడు విద్యార్థి యువత అధ్యయనం చేయాలని, వారి ఆశయాలను అమలు చేయాలని వారు పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు.

భగత్ సింగ్ ఏ లక్ష్యం కోసం అయితే పోరాడారో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదని ఆ స్వతంత్ర ఫలాలు పేద ప్రజలకు అందలేదని ఆయన విమర్శించారు. భగత్ సింగ్ కలలగన్న భారతదేశం నేడు బడా కార్పొరేట్ చేతుల్లో బందీగా మారిపోయిందిని అన్నారు. బీ.జే.పీ. ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని కులాలు మతాలు ప్రాంతాలతో విడదీశారని వారు విమర్శించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.